Bihar: కేసీఆర్‌ స్కెచ్‌తో బీహార్ మారిన రాజకీయ పరిణామాలు..?

Bihar: కేసీఆర్‌ స్కెచ్‌తో బీహార్ మారిన రాజకీయ పరిణామాలు..?
Bihar: 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగింది.

Bihar: 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగింది. అందులో బీజేపీ కీలక పాత్ర వహిస్తే.. ఈసారి బీజేపీకి షాక్‌ ఇస్తూ బీహార్ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకున్నాయి. ఆర్జేడి, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది జేడీయూ. అయితే ఈ పరిణామాల వెనుక కేసీఆర్‌ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న గులాబీ బాస్‌ కేసీఆర్‌ విపక్ష నేతలతో తరుచూ భేటీ అవుతున్నారు. అటు అఖిలేష్‌ యాదవ్‌కు, తేజస్వీ యాదవ్‌కు మధ్య ఉన్న బంధుత్వంతో పాటు, బీజేపీ, జేడీయూ మధ్య వచ్చిన పొరపొచ్చాల నేపధ్యంలో కేసీఆర్‌ చక్రం తిప్పినట్లు సమాచారం. ప్రశాంత్‌ కిషోర్‌ కూడా బీహర్‌ అధికార మార్పిడిలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

Tags

Next Story