KCR Delhi Tour: కుటుంబంతో కేసీఆర్ ఢిల్లీ టూర్.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు..

KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీవెళ్లారు. కుటుంబ సభ్యులతోకలిసి.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని టీఆర్ ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 11 న ఢిల్లీకేంద్రంగా టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు వరి కొనుగోలుపై నిరసన చేపట్టనున్నారు.
వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలంటూ రేపటి నుంచి టీఆర్ ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగనుంది. ఈనేపథ్యంలో ఢిల్లీలో కూడా తమ నిరసనలతో హోరెత్తించనున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్లో భాగంగా ప్రధాని అపాయింట్ మెంట్ కోరినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఒక వేళ ప్రధానితో సమావేశానికి అవకాశం లభిస్తే .. ధాన్యం కొనుగోలుపై మరోసారి మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com