Kedarnath Temple: ఏప్రిల్‌ 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

Kedarnath Temple: ఏప్రిల్‌ 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం
X
చార్‌ధామ్‌ యాత్ర షెడ్యూల్‌..

శీతాకాలంలో దాదాపు ఆరు నెలలుగా మూసివేసిన ప్రఖ్యాత కేదార్‌నాథ్‌ ఆలయం ద్వారాలు ఏప్రిల్‌ 22న తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మందిరాన్ని తిరిగి తెరిచేందుకు శుభ తేదీ, సమయాన్ని నిర్ణయించినట్టు ఆలయ ప్రజా సంబంధాల అధికారి హరీశ్‌ గౌర్‌ ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. బద్రీనాథ్‌ ధామ్‌ ద్వారాలు ఏప్రిల్‌ 23న, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ ఏప్రిల్‌ 19న తెరుచుకుంటున్నాయి. ఉత్తరాఖండ్‌లోని గర్వాలీ హిమాలయ పర్వతాల్లో కొలువైన ఓంకారేశ్వర్‌ ఆలయం తలుపులు ఏప్రిల్‌ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని, దీనికంటే ముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు.

Tags

Next Story