భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండచరియలు.. నిలిచిన కేదార్ నాథ్ యాత్ర

భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండచరియల మధ్య కేదార్ నాథ్ యాత్ర కష్టతరంగా మారింది భక్తులు. ఇవన్నీ తెలిసే భక్తులు ఆ భోళా శంకరుడిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు. కానీ రాష్ట్ర విపత్తు దళం భక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నంలో భాగంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. పరిస్థితి అనుకూలంగా మారిన తరువాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
హిమాలయ ఆలయానికి వెళ్లే దారిలో సోన్‌ప్రయాగ సమీపంలోని ముంకటియా వద్ద వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్రను గురువారం తాత్కాలికంగా నిలిపివేశారు.
ముంకటియా స్లైడింగ్ జోన్ వద్ద కొండచరియలు విరిగిపడిన శిథిలాలు, రాళ్లతో రహదారి పూర్తిగా మూసుకుపోయిందని, దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.
గౌరికుండ్ నుండి తిరిగి వస్తున్న కొంతమంది యాత్రికులు స్లైడింగ్ జోన్‌లో చిక్కుకున్నారని, అయితే వారిని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది రక్షించి సోన్‌ప్రయాగ్‌కు సురక్షితంగా తీసుకువచ్చారని వారు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా కేదార్‌నాథ్ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com