Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్.. ఓటింగ్ రేపటికి వాయిదా..

Delhi Assembly : ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. దీనిపై సభలో చర్చ జరిగింది.. ఉదయం పదకొండు గంటలకు విశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు స్పీకర్.. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అసెంబ్లీ వేదికగా కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు.. తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అన్నారు..
ఆప్ ప్రభుత్వానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని నిరూపించేందుకే విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టామని కేజ్రీవాల్ చెప్పారు. ఆపరేషన్ లోటస్ విఫలమైందంటూ అసెంబ్లీ వేదికగానే కామెంట్స్ చేశారు. అటు కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాధనం, సమయం వృధా చేశారంటూ దుయ్యబడుతున్నారు.. అసెంబ్లీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని ఎవరు అడిగారంటూ నిలదీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com