KERALA: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. ఏంటో తెలుసా

KERALA: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. ఏంటో తెలుసా
కేరళ రాష్ట్రానికి మార్చాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

కేరళ( Kerala) పేరును కేరళం(Keralam‌)గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ( urging the Centre) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‍ (Chief Minister Pinarayi Vijayan‌) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ( Kerala assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది.


రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌( Eighth Schedule of the Constitution of India)లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF ఎలాంటి సవరణలు కోరకుండానే మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే కేరళను మలయాలంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన భాషల్లోనూ అలాగే వ్యవహరించాలని విజయన్‌ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story