Kerala Court: బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష

కేరళలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన.. భాజపా నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15మంది నిషేదిత PFI సంస్థ సభ్యులకు మరణ శిక్ష విధిస్తూ మావెలిక్కర జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 2021 డిసెంబరు 19న అలప్పుజలో.. భాజపా ఓబీసీ మోర్చా కేరళ కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ ను హత్య చేశారు. PFI, SDPIకార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే ఆయనను అతి కిరాతకంగా హత్య చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధ్యతులను అరెస్టు చేసి అన్ని సాక్ష్యాధారాలతో అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. ఈ అభియోగాలపై విచారణ జరిపిన జిల్లా కోర్టు కొంతకాలం క్రితమే 15 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని,భాజపా నేతను ఆయన కుటుంబం కళ్లముందే దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అరుదైన ఈ నేరంలో దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు. నేరస్థులకు మరణశిక్షను విధించింది. ఒక కేసులో ఎక్కువ మందికి ఉరిశిక్ష పడటం కేరళలో ఇదే మొదటిసారి. మవెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. దోషుల్లో నైసమ్, అజ్మల్, అనూప్, అస్లమ్, అబ్దుల్ కలామ్, సలామ్, సఫారుద్దిన్, మన్సద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షేర్నాస్ అష్రఫ్ ఉన్నారు. తొలి ఎనిమిది మంది దోషులు హత్య ఘటనలో నేరుగా పాలుపంచుకోగా, మిగతా వారు హతుడి ఇంటి ఎదుట ఆయుధాలతో నిఘా పెట్టారు.
బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను 2021 డిసెంబరు 19న అలప్పుళలో హత్య చేశారు. పీఎఫ్‌ఎస్‌ఐ, ఎసీపీఐ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొరబడి హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆ ఏడాది డిసెంబర్ 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com