KERALA TORISM: గేమ్ ఆడండి.. టూర్‌ ప్యాకేజీ గెలవండి

KERALA TORISM: గేమ్ ఆడండి.. టూర్‌ ప్యాకేజీ గెలవండి
టూరిస్ట్‌లకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు సిద్ధమైన కేరళ... అందుబాటులోకి హాలీడే హీస్ట్‌ పేరుతో బిడ్డింగ్ గేమ్‌.. అతి తక్కువ ధరకు టూర్‌ ప్యాకేజీలు గెలుచుకునే అవకాశం..




కేరళ భూతల స్వర్గం.. అక్కడ ప్రకృతి సోయగాలకు కొదవలేదు. ఆకుపచ్చని అందాలు, సెలయేర్లు, బోటింగ్‌, హిల్‌ స్టేషన్లు ఇలా కేరళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు టూరిస్ట్‌లకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేరళ ప్రభుత్వం‍(Kerala government) సమాయత్తమైంది. సరికొత్త గేమ్‌(bidding game )ను పరిచయం చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు(attract tourists) ప్రయత్నిస్తోంది. బిడ్‌ వేయండి.. అతి తక్కువ ధరకు టూర్‌ ప్యాకేజీలను దక్కించుకోండి అంటూ ప్రచారం చేస్తోంది. ఇంతకీ ఈ గేమ్‌ ఎలా ఆడాలాంటే...


తక్కువ ధరలకు వెకేషన్ టూర్‌ ప్యాకేజీలను గెలుచుకునేందుకు హాలీడే హీస్ట్‌(Holiday Heist) పేరుతో బిడ్డింగ్ గేమ్‌ను కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ గేమ్‌ను తీసుకొచ్చింది. ఈ గేమ్‌ ఆడితే అతి తక్కువ ధరకు టూర్ ప్యాకేజీ( low prices to boost tourism)లను గెలుచుకోవచ్చని కేరళ పర్యాటక శాఖ ప్రకటించింది.


కేరళ టూరిజం 7510512345 అనే నెంబర్‌తో వాట్సాప్‌( WhatsApp)ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం తొలుత హాలీడే హీస్ట్‌ అని మేసేజ్‌ పంపాలి. అప్పుడు మనకు ఆ రోజు ఉన్న హాలీడే ఆఫర్ కనిపిస్తుంది. ఆ ఆఫర్‌లో చాలా తక్కువగా బిడ్‌ వేసిన వాళ్లకి(thrilling bidding experience) ఆ ఆఫర్‌( offering tour packages) దక్కుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తక్కువ బిడ్‌ వేసిన వాళ్లు ఎవరనేది కేరళ పర్యాటక శాఖ ప్రకటిస్తుంది.

దేశంలోని పర్యాటక రంగంలో ఇదో చారిత్ర మైలురాయని కేరళ పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్‌ తెలిపారు. బిడ్‌ను వ్యూహాత్మక, సృజనాత్మకత ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. వినియోగదారులు గెలవడానికి చాలా తెలివిగా బిడ్‌ను దాఖలు చేయాలని, నెలలో ప్రతి రోజు ఒకరికి అతి తక్కువ ధరకు టూర్‌ ప్యాకేజీ దక్కుతుందని రియాజ్‌ వెల్లడించారు.


ఈ బిడ్డింగ్‌ ప్రారంభించిన తొలి రోజు 50 వేల మంది ఇందులో పాల్గొనగా 30 వేల రూపాయల ప్యాకేజీని ఒక వ్యక్తి కేవలం రూ.5కే పొందినట్లు కేరళ టూరిజం ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆటను మీరు ఆడి అదృష్టాన్ని పరీక్షించుకోండి.

గాడ్స్ ఓన్ కంట్రీగా ఖ్యాతిగాంచిన కేరళను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తారు. జలపాతాలు, పచ్చటి తేయాకు పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, సుందరమైన తీరప్రాంతం, ప్రశాంతమైన బీచ్‌లకు కేరళ ప్రసిద్ధి, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కళా రూపాలకు నిలువెత్తు నిదర్శనంగా కేరళ నిలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story