Suresh Gopi: ఉత్సవానికి అంబులెన్స్‌లో వెళ్లిన కేంద్ర సహాయ మంత్రి

Suresh Gopi: ఉత్సవానికి అంబులెన్స్‌లో వెళ్లిన కేంద్ర సహాయ మంత్రి
X
సురేశ్‌ గోపిపై కేసు నమోదు

కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్‌ సురేశ్‌ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్‌ ను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిస్సూర్‌లో జరిగిన వేడుకకు సురేశ్‌ గోపి అంబులెన్స్‌ లో హాజరుకావటం వివాదాస్పదమైంది. దీనిపై ఓ కమ్యూనిస్ట్‌ నాయకుడి నుంచి కేరళ పోలీసులకు ఫిర్యా దు అందింది. దీంతో సురేశ్‌ గోపిని మొదటి నిందితుడిగా, అంబులెన్స్‌ డ్రైవర్‌ను మూడో నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నది.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ రూటులో డ్రైవింగ్‌ చేయడంతో పాటు అంబులెన్స్‌ని దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేంద్ర సహాయ మంత్రి సురేశ్‌ గోపీపై కేసు నమోదైంది. సీపీఐ త్రిసూర్‌ నియోజకవర్గ కార్యదర్శి, అడ్వకేట్ సుమేష్‌ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అత్యవసర వైద్యం కోసం రోగులను తీసుకెళ్లేందుకు అనుమతించిన అంబులెన్స్‌లో సురేష్ గోపీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సురేష్ గోపి సహా నిందితులపై బీఎన్‌ఎస్‌ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయ సలహా మేరకు ఈ కేసు నమోదు చేశారు.

ఎప్పటిది ఈ కేసు..?

ఈ ఏడాది ఏప్రిల్‌‌లో త్రిస్పూర్‌పురంలోని స్వరాజ్‌ మైదానంలో జరిగిన జాతరకు హాజరైన సురేష్ గోపి.. అంబులెన్స్‌లో అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు, వన్‌ వే రోడ్డులో ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన డ్రైవింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు ఉపయోగించే అంబులెన్స్‌లో ఓ ప్రజాప్రతినిధి ప్రయాణించడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. అయితే, దీనిపై కేంద్ర సహాయ మంత్రి వాదన మాత్రం మరోలా ఉంది. ఆ ప్రాంతంలో తనపై దాడి జరగబోతే, అక్కడి యువకులు రక్షించి అంబులెన్స్‌లో కూర్చోబెట్టారని చెప్తున్నారు.

Tags

Next Story