Monkeypox In India: కేరళలో మూడో మంకీఫాక్స్ కేసు నమోదు..

Monkeypox In India: భారత్‌లో మంకీపాక్స్ గుబులు రేపుతోంది. మూడో మంకీఫాక్స్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 6న యూఏఈ నుంచి మల్లాపూరంకు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి మంకీ ఫాక్స్ సోకినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం అతను మంజేరీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 13, 15 తేదీల్లో అతనిలో మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులను.. పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదవడం కలవరపెడుతోంది. తొలి కేసు కేరళలోని కొల్లాంలో వెలుగుచూడగా.. రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో రెండో మంకీపాక్స్ కేసు బయటపడింది. ఒకరు 39 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా.. మరొకరు 31 ఏళ్ల వ్యక్తి. ఇద్దరూ కూడా దుబాయ్ నుంచి వచ్చిన వారే. జంతువుల నుంచి మనుషులకు మంకీపాక్స్ సోకుతుందంటున్నారు ఆరోగ్య మంత్రి వీనా జార్జ్. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతిదగ్గర ఉండటం వల్ల ఇతరులకి మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు.
వైరస్ లక్షణాలు బయటపడేందుకు 6 నుంచి 13 రోజులు లేదా 5 నుంచి 21 రోజుల సమయం పడుతుందన్నారు జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలన్న కేరళ మంత్రి వీణా జార్జ్.. ఈ వైరస్ సోకిన వారిలో ముఖం, చేతులు, కాళ్లపై దుద్దర్లు ఏర్పడుతాయని చెప్పారు. అయితే.. మంకీఫాక్స్‌తో ఆందోళన వద్దంటున్నారు.కోవిడ్‌కు పాటించే అన్ని నిబంధనలు పాటిస్తే. ఈ వైరస్‌ను అరికట్టవచ్చంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com