AI Teacher: కేరళ స్కూల్లో AI టీచర్

కేరళలో ఏఐ టీచరమ్మ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని కేటీసిటీ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులకు ఏఐతో రూపొందిన రోబోను పాఠాలు చెబుతోంది. ఈ ఏఐ టీచర్‌కు ఐరిస్ అనే పేరు కూడా పెట్టడం విశేషం. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని మేకర్‌ల్యాబ్స్ ఎడ్యుటేక్ సహకారంతో రూపొందించారు. సాంప్రదాయ టీచింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులను ఇది తీసుకొస్తుందని సంస్థ తెలిపింది.
సంప్రదాయ చీరకట్టులో అచ్చం మహిళ గొంతుకతో ఐరిస్ పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. పిల్లలకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పడమే కాదు.. వారి సందేహాలను సైతం నివృత్తి చేస్తోందని మురిసిపోతున్నారు. ఇది బహుభాషల్లో మాట్లాడగలదని రూపకర్తలు వెల్లడించారు. ఐరిస్ పాఠాలు చెబుతున్న వీడియోను మేకర్‌ల్యాబ్స్ ఎడ్యుటేక్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విద్యార్థులతో ‘ఐరిస్’ మూడు భాషల్లో మాట్లాడుతుందని, సంక్లిష్టమైన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పగలదని పేర్కొన్నది. ఇంటెల్ ప్రాసెసర్ కలిగిన ‘ఐరిస్’లో వాయిస్ అసిస్టెంట్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్, మొబిలిటీ.. మొదలైన ఆప్షన్లు ఉన్నట్టు సంస్థ తెలిపింది. నీతి ఆయోగ్ చొరవతో కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్, కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్ సంయుక్తంగా ఈ ఆవిష్కరణ చేపట్టాయి. ఐరిస్ పలు సబ్జెక్టులకు సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలకు చాలా సులువుగా సమాధానాలు ఇస్తోంది. ఇది తనంతట తాను నడిచేలా చక్రాలను ఏర్పాటుచేశారు.
ఈ పరిణామం కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పులను సూచిస్తుంది. ఐరిస్‌కు పాఠ్యాంశాలు బోధన, విభిన్న అభ్యాస శైలులతో పాటు విద్యార్ధులకు విద్యను మరింత ఆకర్షణీయంగా చేయగల సామర్థ్యం ఉంది. దీర్ఘకాలిక ప్రభావం ఉన్నప్పటికీ, ఐరిస్ ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యపై ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఇక్కడ AI తరగతి గదిలో సహాయక పాత్రను పోషిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com