Khalistani Terrorist: నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్

Khalistani Terrorist: నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్
X
సిక్కుల ఊచకోతకు 40 ఏళ్లు అయిన సందర్భంగా హెచ్చరికలు

భారతదేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్.. ‘ఎయిర్‌ ఇండియా’కు వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్‌ ఇండియా ఫ్లైట్ లో ప్రయాణించొద్దని అతడు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా విమానాలపై దాడి జరిగే ఛాన్స్ ఉందని పన్నూన్ తెలిపారు. అందులో ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దని ఓ వీడియోను విడుదల చేశాడు. కాగా, పన్నూన్ ఇలాంటి వార్నింగ్ చేయడం ఇది తొలిసారి కాదు.సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది.

మరోవైపు గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags

Next Story