Uttarpradesh: రక్తమార్పిడితో 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ, హెపటైటిస్ సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివరాలలోకి వెళితే కాన్‌పుర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో 14 మంది పిల్లలకు రక్త మార్పిడి చేశారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవీ పాజిటీవ్, హెపటైటిస్ బి, సి సోకినట్లు తేలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. డబుల్ ఇంజిన్ సర్కార్ లో అనారోగ్యాలు కూడా డబుల్ అవుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ తప్పునకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని ఎక్కించారు. ఈ నేపధ్యంలో ఈ చిన్నారులు హెచ్‌ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ తదితర వ్యాధుల బారిన పడ్డారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అటు కేంద్రం, ఇటు యూపీ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసిందని’ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. తలసేమియాతో బాధపడుతున్న 14 మంది చిన్నారులకు వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించారు. ఫలితంగా ఆ పిల్లలకు హెచ్‌ఐవీ ఎయిడ్స్,హెపటైటిస్ బీ, సీ తదితర తీవ్రమైన వ్యాధులు సోకాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ క్షమించరాని నేరానికి అమాయక పిల్లలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నడైనా జవాబుదారీతనాన్ని కలిగివున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ఈ చిన్నారులు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్, ఫరూఖాబాద్, ఇటావా, ఔరైయా, కన్నౌజ్‌లతో సహా వివిధ జిల్లాలకు చెందినవారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వ్యాధులు నిజంగా ఎలా సోకాయే కనుక్కునే పనిలో పడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com