Pakistan: బలూచిస్తాన్‌లో ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు

Pakistan: బలూచిస్తాన్‌లో  ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు
X
ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో సాయుధ దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. బస్సును అడ్డుకుని 9 మంది ప్రయాణికుల్ని కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ప్రయాణికుల్ని కిడ్నా్ప్ చేసి చంపేశారని శుక్రవారం అధికారులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలు రాత్రిపూట పర్వతాల్లో దొరికాయని ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

బస్సులో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిని దించేసి.. మిగతా వారిని కిడ్నాప్ చేసి చంపేశారు. కలేటా నుంచి లాహోర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్-40లో ప్రయాణికుల బస్సును సాయుధ దళాలు ఆపాయి. ముష్కరులు లోపలికి వెళ్లి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తొమ్మిది పురుషులను కిడ్నాప్ చేసి.. అనంతరం కాల్చి చంపేశారు. కిడ్నాపైన గంటన్నర వ్యవధిలోనే మృతదేహాలు కొండ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. దాడి చేసిన వారు 10-12 మంది ఉండొచ్చని అధికారులు చెప్పారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని షరీఫ్ సంతాపం తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

Tags

Next Story