Kolkata Doctors protest: కోల్‌కతా హత్యాచార ఘటన..
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటకు వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ సర్కార్ పై సీరియస్ అయింది. ఆసుపత్రిలో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడింది సుప్రీంకోర్టు. పనులు ఎందుకు ఆలస్యంగా కొనసాగుతున్నాయి.. మేం ఆగస్టు 9 నుంచి పర్యవేక్షిస్తున్నాం.. జరుగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
అలాగే, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల కేసు కోల్‌కతా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తీరుపై ఈరోజు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు ఇన్‌స్పెక్టర్ అభిజిత్ మోండల్, ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేందుకు మరింత కస్టడీని కస్టడీని పొడిగించాలని కోరింది. అలాగే, తాలా పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజీతో సహా డీవీఆర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్‌ల నుంచి సేకరించిన డేటాలో కీలకమైన వాస్తవాలను వెలికితీసినట్లు సీబీఐ పేర్కొనింది.
ఇక, అభిజిత్ మోండల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోజుల తరబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను సేకరించలేదని పేర్కొన్నారు. సీబీఐ వద్ద డేటా ఉంటే మళ్లీ కస్టడీ ఎందుకు అని అడిగారు. అలాగే, సందీప్ ఘోష్ తరపు న్యాయవాది వాదిస్తూ.. నా క్లైంట్ ఆర్‌జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్.. తాలా పోలీస్ స్టేషన్‌కి కాదు అన్నారు. సందీప్ ఘోష్ బెయిల్‌ను జాప్యం చేసేందుకే సీబీఐ కస్టడీని కోరుతుందని డిఫెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ కస్టడీలో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. వారు ఒక్కసారి కూడా నా క్లయింట్‌ను ప్రశ్నించలేదని సందీప్ ఘోష్ లాయర్ పేర్కొన్నారు. దీంతో సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. నిందితులిద్దరినీ మరో నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com