Kolkata Horror: :సహ నిందితుడితో నేరపూరిత సంబంధాలు, లెక్కలేనన్ని ఆస్తులు

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తూ సంచలనమవుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మాజీ ప్రిన్సిపాల్‌కు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. అందులో సందీప్ ఘోష్‌కి చెందిన సౌత్ 24 పరగణాస్ జిల్లా కేనింగ్‌లో విలాసవంతమైన బంగ్లా బయటపడింది. రెండు ఫ్లాట్ల సమాచారం లభించింది. ఇది కాకుండా, సందీప్ ఘోష్‌కు కోల్‌కతాలోని బెలేఘాటాలో నాలుగు అంతస్తుల ఇల్లు కూడా ఉంది. ఈ నివాసంలోని గ్యారేజీలో ఈడీ అధికారులు కొత్త ఎస్ యూవీని కూడా కనుగొన్నారు. కోల్‌కతా అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో ఆర్‌జీకార్ కేసులో ఆర్థిక అవకతవకల కేసును సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తోంది. బెలేఘాటా ఐడి హాస్పిటల్‌కు ఆనుకుని ఉన్న భవనం కేర్‌టేకర్ ప్రకారం.. కొత్తగా గుర్తించిన రెండు ఫ్లాట్‌లు సందీప్ ఘోష్‌కు చెందినవి. సందీప్ ఘోష్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక ఫ్లాట్‌ను కార్యాలయంగా, మూడవ అంతస్తులో మరొక ఫ్లాట్‌ను ఉపయోగించుకున్నట్లు కేర్‌టేకర్ సూచించాడు.
ఈ ఫ్లాట్లను సందీప్ ఘోష్ అప్పుడప్పుడు సందర్శిస్తుండేవాడని సమాచారం. పార్కింగ్ ఏరియాలో కొత్త ఎస్ యూవీని పార్క్ చేశారు. ఇది 3-4 నెలల క్రితం కొనుగోలు చేశారని తెలుస్తోంది. సందీప్ ఘోష్ కొన్నిసార్లు ఈ వాహనాన్ని ఉపయోగించడం కనిపించింది. అయితే ఈ ఫ్లాట్లపై ఎలాంటి గుర్తింపు నేమ్‌ప్లేట్లు లేవు. సందీప్ ఘోష్ తన గుర్తింపును దాచడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ఫ్లాట్లలో తన పేరు నమోదు చేయకుండా తప్పించుకున్నాడని ఈడీ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో భాగంగా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సంపాదించినట్టు సీబీఐ తెలిపింది. అలాగే సహ నిందితులతో డాక్టర్ సందీప్ ఘోష్‌కు ఉన్న నేరపూరిత సంబంధం ప్రభుత్వానికి నష్టం చేకూర్చగా అతడికి, సహ నిందితులకు మాత్రం లబ్ధి జరిగిందని వివరించింది.
ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ ఇప్పటికే ఘోష్, ఇద్దరు వ్యాపారులు, అతడి సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుంచే అరెస్ట్ అయిన ఇద్దరు వ్యాపారులతో ఘోష్‌కు సంబంధాలున్నాయని సీబీఐ పేర్కొంది. వారితో ఘోష్‌కు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే ఆర్‌జీ కాలేజీకి మెటీరియల్ సరఫరా చేసే కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారని తెలిపింది. అంతేకాదు, తన సెక్యూరిటీ గార్డు భార్య సంస్థకు ఆసుపత్రిలో కేఫ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సీబీఐ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com