రెజ్లర్లకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ట్వీట్

రెజ్లర్లకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధ్యతగల నాయకులెవరైనా ఈ ఘటనకు సమాధానం చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. రెజ్లర్ల అరెస్ట్‌లను ఖండిస్తూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌పై నాయకులు ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రపంచ వేదికపై దేశానికి కీర్తి తెచ్చిన ఛాంపియన్లకు మద్దతివ్వాలని, వారిని గౌరవించాలని ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌ని, వారి నిరసనపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రెజ్లర్ల నిరసనను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కిందని అన్నారు.
చాపలు, దిండ్లు, దోమతెరలు అన్నీ పీఎస్ వెహికల్స్‌లో ఎక్కించి పోలీసులు తరలించారు. రెజ్లర్లను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. సాయంత్రానికి పీఎస్ నుంచి వదిలిపెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కొత్త పార్లమెంట్‌లో ఆసీనుడైతే.. బాధితులైన రెజ్లర్లు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇదెక్కడి న్యాయమంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
https://twitter.com/KTRBRS/status/1662906676297465856
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com