LABOUR CODES: కొత్త లేబర్ కోడ్స్... ఆందోళన అవసరం లేదు

LABOUR CODES: కొత్త లేబర్ కోడ్స్... ఆందోళన అవసరం లేదు
X
స్పష్టతనినిచ్చిన కార్మిక శాఖ... టేక్ హోమ్ శాలరీలో నో ఛేంజెస్... 10 రంగాల ఉద్యోగులకు బెనిఫిట్స్ ... ఉద్యోగులకు భారీ ఉపశమనం

కేంద ప్ర­భు­త్వం ఇటీ­వల కొ­త్త కా­ర్మిక సం­స్క­ర­ణ­ల­ను తీ­సు­కొ­చ్చిన వి­ష­యం తె­లి­సిం­దే. పాత వా­టి­ని పు­న­రు­ద్ద­రిం­చి కొ­త్త వా­టి­ని ప్ర­వే­శ­పె­ట్టిం­ది. వీటి వల్ల అన్ని రం­గా­ల్లో­ని ఉద్యో­గు­ల­కు ఆర్ధిక, సా­మా­జిక భద్రత లభిం­చ­నుం­ది. గిగ్ వర్క­ర్ల­కు కూడా ఇవి వర్తిం­చ­ను­న్నా­యి. పాత వా­టి­ల్లో మా­ర్పు­లు చేసి కొ­త్త­గా తె­చ్చిన నా­లు­గు కా­ర్మిక కో­డ్‌­ల­లో అనేక అం­శా­ల­పై ఉద్యో­గు­ల్లో ఆం­దో­ళన నె­ల­కొం­ది. ఈ లే­బ­ర్ కో­డ్‌­ల­లో ఉద్యో­గి జీతం నుం­చి పీ­ఎ­ఫ్, ఇతర వె­ల్‌­ఫే­ర్ స్కీ­మ్స్‌­కు ఎక్కువ మొ­త్తం­లో వాటా వె­ళ్లే­లా ని­బం­ధ­న­లు ఉన్నా­య­ని కొం­త­మం­ది­లో అయో­మ­యం నె­ల­కొం­ది. దీని వల్ల టేక్ హోమ్ శా­ల­రీ తగ్గు­తుం­ద­నే వా­ర్త­లు వస్తు్న్నా­యి. దీం­తో కా­ర్మిక శాఖ తా­జా­గా క్లా­రి­టీ ఇచ్చిం­ది.

కొ­త్త సం­స్క­ర­ణల వల్ల టేక్ హోమ్ శా­ల­రీ­లో ఎలాం­టి మా­ర్పు­లు ఉం­డ­వ­ని కా­ర్మి­క­శాఖ స్ప­ష్ట­త­ను ఇచ్చిం­ది. ఈపీ­ఎ­ఫ్‌­కి సం­బం­ధిం­చి చట్ట­బ­ద్ద వేతన పరి­మి­తి రూ.15 వే­లు­గా­నే ఉంది. దీ­ని­పై కొ­త్త లే­బ­ర్ కో­డ్‌ల ప్ర­భా­వం అసలు ఉం­డ­ద­ని స్ప­ష్ట­త­ని­చ్చిం­ది. రూ.15 వేల పరి­మి­తి­కి మంచి మీరు కాం­ట్రి­బ్యూ­ట్ చే­సు­కో­వా­లం­టే అది మీ వ్య­క్తి­గత వి­ష­య­మ­ని తె­లి­పిం­ది. కం­పె­నీ­లు తప్ప­ని­స­రి­గా ఈ పరి­మి­తి­ని అమలు చే­యా­ల్సిన అవ­స­రం కూడా లే­దం­ది. ఉద్యో­గి, కం­పె­నీ మధ్య మ్యూ­చు­వ­ల్ అం­డ­ర్‌­స్టా­డిం­గ్‌­ను బట్టి పెం­చు­కో­వా­లా.. వద్దా అనే­ది సొంత ని­ర్ణ­య­మ­ని చె­ప్పు­కొ­చ్చిం­ది. దీని వల్ల మీ టేక్ హోమ్ శా­ల­రీ­లో ఎలాం­టి మా­ర్పు­లు లే­వ­ని పే­ర్కొం­ది. నె­ల­కు రూ.60 వేల శా­ల­రీ మీకు వస్తు­ద­ను­కు­న్నాం. పాత చట్టాల ప్ర­కా­రం ఈపీ­ఎ­ఫ్ ఉద్యో­గి వాటా రూ.1800, కం­పె­నీ వాటా రూ.1800 పోతే రూ.56,400 టేక్ హోమ్ శా­ల­రీ అం­దు­తుం­ది. అయి­తే కొ­త్త లే­బ­ర్ కో­డ్‌ల ప్ర­కా­రం ఈపీ­ఎ­ఫ్ గరి­ష్ట వేతన పరి­మి­తి­లో ఎలాం­టి మా­ర్పు­లు చే­య­లే­దు. దీని వల్ల మీకు పాత వి­ధా­నం ద్వా­రా­నే టేక్ హోమ్ శా­ల­రీ­లో ఎలాం­టి మా­ర్పు­లు ఉం­డ­వ­ని కా­ర్మి­క­శాఖ స్ప­ష్టం చే­సిం­ది. దీం­తో ఉద్యో­గు­లు =-ఆం­దో­ళన చెం­దా­ల్సిన అవ­స­రం లే­ద­ని పే­ర్కొం­ది.

బెనిఫిట్స్ ఇవే

ఫి­క్స్‌­డ్ టర్మ్ ఉద్యో­గు­లు: ఇకపై వీరు పర్మ­నెం­ట్ ఉద్యో­గుల మా­ది­రి­గా­నే లీవ్, మె­డి­క­ల్ కవర్, సో­ష­ల్ సె­క్యూ­రి­టీ వంటి అన్ని ప్ర­యో­జ­నా­లు పొం­దు­తా­రు. గ్రా­ట్యు­టీ­కి 5 ఏళ్లు ఆగ­కుం­డా ఏడా­ది­కే అర్హత లభి­స్తుం­ది. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు: పెరుగుతున్న ఈ వర్కర్ల సంక్షేమం కోసం కంపెనీలు వార్షిక ఆదాయంలో 1-2% వెచ్చించాల్సి ఉంటుంది. వారికి ఆధార్ లింక్ అయిన యూఏఎన్ నంబర్‌తో పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు: వీరికి ఏడాదికోసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య, సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు కల్పించాలి. వీరికి కూడా ఏడాది తర్వాత గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. మహిళా ఉద్యోగులు: లింగ వివక్షను తొలగించారు. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. మహిళలు నైట్ షిఫ్ట్‌లు, అండర్ గ్రౌండ్ మైనింగ్ వంటి ప్రమాదకర ప్రాంతాల్లో కూడా పని చేయవచ్చు. ఐటీ, ఐటీ­ఈ­ఎ­స్ ఉద్యో­గు­లు: వీ­రి­కి ప్ర­తి నెలా 7వ తే­దీ­లో­పు జీ­తా­లు అం­దా­లి. మహి­ళ­లు నైట్ షి­ఫ్టు­లు చే­య­వ­చ్చు. మీ­డి­యా వర్క­ర్లు: వీ­రి­కి అపా­యిం­ట్‌­మెం­ట్ లె­ట­ర్స్, సో­ష­ల్ సె­క్యూ­రి­టీ రై­ట్స్ తప్ప­ని­స­రి. ఓవర్ టైమ్ చే­స్తే సా­ధా­రణ వే­త­నా­ని­కి రెం­డిం­త­లు చె­ల్లిం­చా­లి. యూత్ వర్క­ర్లు: అన్ని కే­ట­గి­రీ­ల్లో­ని వర్క­ర్ల­కు కనీస వే­త­నం, అపా­యిం­ట్‌­మెం­ట్ లె­ట­ర్ తప్ప­ని­స­రి. ఎంఎస్ఎంఈ వర్కర్లు: వీరికి సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 వర్తిస్తుంది. పని ప్రదేశంలో రెస్ట్ ఏరియా, డ్రింకింగ్ వాటర్, క్యాంటీన్ వంటివి కల్పించాలి.

Tags

Next Story