Haryana-Rajasthan: రాజస్థాన్‌లో టికెట్ తీసుకోని.. హర్యానాకు మహిళా కానిస్టేబుల్, అడిగితే ..

రీవెంజ్ గా హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు

ఈ వీడియోలో, హర్యానాకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఎక్కారు. దీంతో టికెట్ తీసుకోవాంటూ బస్ కండక్టర్ కోరారు. సదరు కానిస్టేబుల్ బస్సు ఛార్జీని చెల్లించడానికి నిరాకరించింది. మహిళా పోలీసులు హర్యానా అర్టీసీలో ఫ్రీ ప్రయాణం ఉందని వారించింది. అయితే, ఇది హర్యానా రోడ్‌వేస్ కాదు, రాజస్థాన్ రోడ్‌వేస్ అని కండక్టర్ మొండిగా వాదించాడు. కానీ మహిళా కానిస్టేబుల్ చార్జ్ చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కండక్టర్‌ వాగ్వాదానికి దిగారు. మహిళ కానిస్టేబుల్‌కు తోటి ప్రయాణికులు సైతం టికెట్ తీసుకోవాలని కోరారు. కానీ ఆమె అంతే గట్టిగా టికెట్ తీసుకోవడానికి నిరాకరించారు. వాగ్వాదం సమయంలో కానిస్టేబుల్ బస్సు కండక్టర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం కనిపించింది. ఈ సమయంలో కండక్టర్ స్వయంగా ఆ మహిళను వీడియో తీశాడు.

వైరల్ వీడియోలో, మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీరు డబ్బు చెల్లించాలి అని కండక్టర్ మహిళతో గట్టిగా వాదించాడు. దీనిపై మహిళా కానిస్టేబుల్ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారని, హర్యానాలో మహిళా కానిస్టేబుల్‌కు ఉచిత ప్రయాణం ఉందని చెప్పారు. దీని తర్వాత కండక్టర్ ఇది రాజస్థాన్ రోడ్‌వేస్ అని, మీరు హర్యానా పోలీస్‌లో ఉన్నారని, దీనిపై లేడీ కానిస్టేబుల్ అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. బస్సు హర్యానాలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. దీని తరువాత, తోటి ప్రయాణీకులు మహిళకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ అర్థం చేసుకోవడానికి బదులుగా, ఆ మహిళ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. ఈ వీడియో ఘర్ కే కలేష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ‘X’ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 74 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. అయితే చాలా మంది వీడియోను లైక్ చేశారు.

దీంతో హర్యానా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్‌లు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. దీని తర్వాత, హర్యానా పోలీసులు రాజస్థాన్ నుంచి వెళ్లే ప్రతి బస్సుకు.. పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవర్, కండక్టర్ల సరైన యూనిఫాం, టైర్లలో గాలి పేరుతో చలాన్ జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా హర్యానా పోలీసులు హఠాత్తుగా భారీ మొత్తంలో చలాన్లు జారీ చేయడం రాజస్థాన్ రోడ్‌వేస్‌లో కలకలం సృష్టించింది.

ఈ విషయం ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వ పెద్దలకు చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ అధికారులు హర్యానా పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. టికెట్ తీసుకోనందుకు మహిళా కానిస్టేబుల్‌కు చలాన్ జారీ చేసిన వైరల్ వీడియో కారణంగా.. రాజస్థాన్ – హర్యానాలో భారీ కలకలం చెలరేగింది.

Tags

Next Story