Lakshadweep: లక్షద్వీప్ అందాలు చూసొద్దామా..

ప్రధాని మోదీ చేసిన ఒక్క పర్యటన..లక్షద్వీప్ స్వరూపాన్నే మార్చేస్తోంది. బాయ్‌కాట్ మాల్దీవులు నినాదంలో వేలాదిమంది పర్యాటకులు లక్షద్వీప్‌కు క్యూ కడుతున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు, లవ్ ఫర్ లక్షద్వీప్ నినాదంతో సెలబ్రెటీలు, నెటిజన్లు. మాల్దీవులకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్‌కు వెళ్తున్నారు. అరేబియా సముద్రంలో ఉండే మొత్తం 36 దీవుల సముదాయామే లక్ష ద్వీప్.ఈ దీవులు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. ఈ దీవుల్లో సుందరమైనది. అగాతి దీవి. మోదీ పర్యటన తర్వాత.. ఈ అగాతి దీవి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
సహజమైన తెల్లటి ఇసుక స్వచ్ఛమైన నీరు ఆకట్టుకునే పగడపు దిబ్బలు సుందరమైన బీచ్‌లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవీ అగాతి దీవిలోని ప్రత్యేకతలు. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి ఇక్కడ భూతల స్వర్గం వారికి స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత చెలరేగిన బాయ్‌కాట్ మాల్దీవులు నినాదంతో.. వేలమంది పర్యాటకులు లక్షద్వీప్‌లోని దీవులకు క్యూ కడుతున్నారు. అగాతి దీవిలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. ఈ దీవిలోని నీలి రంగు సముద్రపు జలాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర గర్భంలోని జీవజాలం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అగాతి దీవిలో సముద్రపు ఒడ్డున కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమాన్ని చూస్తూ పర్యాటకులు మైమరచిపోతున్నారు. సముద్రపు ఒడ్డున ఉన్న కొబ్బరిచెట్ల నుంచి తీసిన నీరాను సేవిస్తూ సేదతీరుతున్నారు. అగాతి దీవిలో స్థానికుల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, నీరాను విక్రయించడం. లక్షద్వీప్‌లోని స్థానికులకు.. కొబ్బరి నీరా ఓ సాధారణ పానీయం. అగాతి వాసులు.. తాజా కొబ్బరి నీరాను పర్యాటకులకు విక్రయించి జీవనోపాధి పొందుతారు.
అగాతి దీవిలో స్నార్కెలింగ్ చేయడానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. స్నార్కెలింగ్ చేస్తూ సముద్ర గర్భంలోని జీవజాలాన్ని చూస్తు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పగడపు దిబ్బలను..విభిన్న రకాల చేపలను.. జలచరాల అందాలను చాలా దగ్గరగా వీక్షించొచ్చు. భారత్‌లోని ఏ ప్రాంతం నుంచి లక్షద్వీప్‌కు వెళ్లాలన్న సముద్రం లేదా వాయు మార్గాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. లక్షద్వీప్‌లో ఉన్న ఒకే ఒక విమానాశ్రయం... అగాతి దీవిలోనే ఉంది. అగాతి విమానాశ్రయం ల్యాండింగ్ ప్యాడ్‌కు రెండు వైపులా సముద్ర తీరం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కూడా ఎంతో అందమైన అనుభూతిని ఇస్తుంది. చుట్టు పక్కల వాతావరణాన్ని అస్వాదిస్తూ ల్యాండింగ్, టేకాఫ్ కావొచ్చు.
అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్... 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. కేరళలోని కొచ్చి’ని లక్షద్వీప్‌కు ‘గేట్ వే’గా పేర్కొంటారు. కోచి నుంచి సముద్ర మార్గంలో నౌక ద్వారా లక్షద్వీప్ వెళ్లాలంటే 18 గంటల సమయం పడుతుంది. కోచి నుంచి లక్షద్వీప్‌కు పలు సమయాల్లో 7 నౌకలు అందుబాటులో ఉన్నాయి. ఈ నౌకలు కొచ్చి, లక్షద్వీప్ మధ్య పర్యాటకులను తరలిస్తుంటాయి. కొచ్చి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ నుంచి విమానం ద్వారా అగాతి దీవికి చేరుకోవచ్చు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com