Lalu Prasad Yadav: మరింత విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. శరీరంలో కదలికలు లేవు!

Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన శరీరంలో కదలికలు లేవని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇప్పటికే తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బీహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com