Rains : భారీ వర్షాలు, విరుగుతున్న కొండ చరియలు

Rains : భారీ వర్షాలు, విరుగుతున్న కొండ చరియలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, పలు రాష్ట్రలలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో దేశంలోని తూర్పు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, బీహార్‌లలో తలెత్తిన వర్షపాతం‌లోటు అధిగమించవచ్చు. జూన్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్ని జూలైలో కురిసిన భారీ వర్షాలు తీర్చేశాయి. జూలై నెలలో 13 శాతం ఎక్కువగా వర్షపాతం కురిసింది.

ఒడిశాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కియోఝర్‌లో భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడడంతో జాతీయ రహదారి 49పై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కియోంఝర్‌, బొలంగిర్‌, కలహండి, సోనెపుర్, నౌపడ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఒడిశా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.బీహార్ లో ఆగస్టు 5 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్పడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్, హిమాలయ రాష్ట్రాలు, రాజస్థాన్ లో కూడా తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో కూడా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి అని వాతావరణశాఖ చెబుతోంది.


అటు హిమచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి NH-5 కోతకు గురైంది. హిమాచల్ ప్రదేశ్‌ పార్వతి లోయలోని చక్కిమోడ్ వద్ద చండిగఢ్‌- సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి రోడ్డులో కొంత భాగం పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. ఫలితంగా జాతీయ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చండిగఢ్‌- సిమ్లా జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. విరిగిపడిన కొండచరియలను తొలగించే పనిలో ఉన్నారు. రోడ్డు పనులు పూర్తై, తిరిగి ప్రారంభించేంతవరకు... ప్రత్యామ్నాయ ప్రణాళికలకు ప్రయాణికులు కట్టుబడి ఉండాలని సోలన్ పోలీసులు కోరారు.

ఇక ఈ వర్షాకాలంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 190మంది మరణించారు. కొండచరియలు విరిగిపడి,వరదల వల్ల 54మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల్లో 136మంది మృతిచెందారు. 34 మంది గల్లంతయ్యారు. మరో 219మంది గాయపడ్డారని హిమాచల్‌ ప్రదేశ్‌ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story