Mallikarjun Kharge: దేశాన్ని రక్షించేందుకు ఇదే చివరి అవకాశమన్న ఖర్గే

Mallikarjun Kharge: దేశాన్ని రక్షించేందుకు ఇదే చివరి అవకాశమన్న ఖర్గే
X
ఎన్నికల షెడ్యుల్ విడుదలైన వేళ కలిసి పోరాడదామని పిలుపు

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు ఇదే చివరి అవకాశమని కాంగ్రెస్ అధ్యక్షుడుఅన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదలైన వేళవిద్వేషం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశ ప్రజలంతా కలిసి పోరాడతారని చెప్పారు. భారత్ లో... న్యాయానికి ఈ ఎన్నికలు తలుపులు తెరుస్తాయని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం కావచ్చని పేర్కొన్నారు. "హాత్ బద్లేగా హలాత్ ' అంటూ ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్నికల బాండ్లు, ప్రతిపక్షాల నిధుల ఖాతాలను స్తంభింపజేయండంవంటి..ఎన్నో కుంభకోణాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు ఓ మైలురాయిగా నిలవనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేర్ తెలిపారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరుగనున్నది. జూన్‌ 1న చివరి దశ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 4న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 13 రాష్ర్టాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకూ ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో భాగంగా మే 13న తెలంగాణలోని 17 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఏడు దశల్లోనూ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్‌ కుమార్‌తోపాటు కొత్త కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ర్టాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్‌ ఎన్నికల నాలుగో విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. 60 అసెంబ్లీ సీట్లు ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌, 32 స్థానాలు ఉన్న సిక్కింలో ఏప్రిల్‌ 19న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఒడిశాలో(147 స్థానాలు) మాత్రం నాలుగు విడతలుగా(మే 13, 20, 25, జూన్‌ 1) అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు.

Tags

Next Story