aw student : లా విద్యార్థిపై సహ విద్యార్థుల దాడి..

ఓ ప్రైవేట్ యూనివర్సిటీ లో లా విద్యార్థి పై అతడి సహ విద్యార్థులే దాడికి పాల్పడ్డారు. వర్సిటీలోని పార్కింగ్ ప్లేసులో ఈ దాడి జరిగింది. ఐదుగురు విద్యార్థులు అతడిని కారులో కూర్చోబెట్టి కొట్టారు. ఓ యువతి, యువకుడు బాధితుడి చెంపలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. మిగతా ముగ్గురు విద్యార్థులు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి యూనివర్సిటీ గ్రూప్‌లో వైరల్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని అమిటీ విశ్వవిద్యాలయం లో ఈ ఘటన చోటుచేసుకుంది.
‘లా’ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శిఖర్ అనే యువకుడిపై ఆయుష్ యాదవ్, ఝాన్వీ మిశ్రా, మిలాయ్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమన్ శుక్లా అనే సహ విద్యార్థులు దాడికి దిగారు. ఏకంగా 50-60 చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. వారం క్రితం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన బృందంలోని ఓ విద్యార్థి రికార్డు చేసి క్యాంపస్‌లో వైరల్ చేశారు. పార్కింగ్ జాగాలో ఆపిన కారులో ఈ దాడి జరిగింది.
ఆయుష్ యాదవ్, ఝాన్వీ మిశ్రా మరో యువకుడు పదేపదే శిఖర్ చెంప చెల్లుమనిపించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అయిదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ‘ముఖం పైనుంచి చేయి తియ్.. క్యారక్టర్ గురించి నువ్వేమన్నావ్?’ అంటూ చెంపలపై కొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com