Law student suicide: నోయిడాలో లా స్టూడెంట్ ఆత్మహత్య..

నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్టార్ 99లోని సుప్రీం టవర్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌కి చెందిన తపస్‌గా గుర్తించారు. అమిటీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చదువుతున్న 23 ఏళ్ల తపస్ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రియురాలు ప్రేరేపించిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు.
తపస్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు ఆమె మాజీ ప్రియురాలిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో తపస్ స్నేహితులు, అతడి మాజీ ప్రియురాలు ఫ్లాట్‌లోనే ఉన్నారు. పోలీస్ వర్గాల సమచారం ప్రకారం..తపస్, అతడి ఎక్స్-గర్ల్ ఫ్రెండ్‌ని కలిపేందుకు స్నేహితులు ప్రయత్నించారు. ఈ మేరకు తపస్ స్నేహితులు వారి ఫ్లాట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు వచ్చారు. అయితే, మళ్లీ కలిసేందుకు ఆమె నిరాకరించింది. దీంతోనే ఆత్మహత్య చోటు చేసుకుందని కేసు నమోదైంది.
ఈ కేసులో ఆమెను కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తపస్‌తో మళ్లీ కలిసేందుకు ఆమె నిరాకరించిందని, దీంతోనే తపస్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కోర్టుకి తెలిపారు. అయితే, ఇది ఆత్మహత్యను ప్రేరేపించడం కిందకు రాదని కోర్టు గుర్తించి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com