Swati Maliwal: ఇగోను వదిలేయండి.. ప్రజల కోసం పని చేయండి..

Swati Maliwal: ఇగోను వదిలేయండి.. ప్రజల కోసం పని చేయండి..
X
కేజ్రీవాల్‌కు స్వాతి మలివాల్‌ అడ్వైజ్‌..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పోటీ చేసిన ఒక్కస్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. కాగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్పందించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంతి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇగోను వదిలేయాలని ఎంపీ స్వాతి మలివాల్‌ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. కింగ్‌ మేకర్‌ కావాలనే ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చాలా స్థానాల్లో అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని సమాచారం. ఆ క్రమంలో ఆ పార్టీ రెబల్‌ ఎంపీ స్వాతి మలివాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి చురకలంటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లో.. కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించింది.

మాజీ సీఎం కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని.. కానీ, తనపై బీజేపీ ఏజెంట్‌ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారంటూ విమర్శించింది. నేడు ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వయంగా ఇండియా కూటమికి ద్రోహం చేస్తూ కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టిందని ఆరోపించారు. అవన్నీ పక్కనబెట్టి వినేశ్‌ ఫోగట్‌ను ఓడించేందుకు అభ్యర్థిని కూడా రంగంలోకి దించారన్నారు. సొంత రాష్ట్రంలో డిపాజిట్లు కూడా కాపాడుకోలేని పరిస్థితికి ఆప్‌ ఎందుకు చేరుకుదంటూ నిలదీశారు. కేజ్రీవాల్‌ను ఈగోను వదిలేసి.. ముసుగును తొలగించానల్నారు. డ్రామాలు మాని.. ప్రజల కోసం పని చేయాలంటూ ట్వీట్‌ చేశారు.

Tags

Next Story