Lemon Price: ఆరు రెట్లు పెరిగిన నిమ్మ ధరలు.. ఒక్క నిమ్మకాయకు ఏకంగా..

Lemon Price: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధర పెరగని వస్తువంటూ లేదు. నిత్యావసరాల ధరల దగ్గర నుండి లగ్జరీ వస్తువుల వరకు ప్రతీదానికి ధర ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోని నిమ్మకాయ కూడా చేరనుంది. వేసవి కాలంలో అన్నింటికంటే ముఖ్యంగా నిమ్మకాయ షర్బత్‌ను తాగడానికి ఇష్టపడతారు చాలామంది. కానీ ఇప్పుడు ఈ నిమ్మకాయ ధర దేశవ్యాప్తంగా ఏకంగా 6 రెట్లు పెరిగింది.
నిమ్మకాయ సాగు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తుంది. దీనికి ఎక్కువగా నీటి సరఫరా అవసరం లేదు. అందుకే ఏలూరులో ఎక్కువగా నిమ్మసాగు కనిపిస్తుంది. దేశంలో పండించే నిమ్మసాగులో 40 నుండి 45 శాతం ఏలూరులోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా రవాణా అయ్యే నిమ్మకాయల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ఇది కూడా ధర పెరుగుదలకు ఒక కారణంగా నిలుస్తోంది.
కోవిడ్ వల్ల, భారీ వర్షాలు వల్ల చాలా ప్రాంతాల్లో నిమ్మసాగు దెబ్బతిన్నది. దీంతో నిమ్మకాయల కొరత ఏర్పడి వారి ధర కూడా ఆకాశాన్నంటింది. ఒకప్పుడు టన్నుకు రూ.5 లక్షలు ఉండే నిమ్మ ధర.. ఇప్పుడు ఏకంగా రూ.31 లక్షలకు చేరుకుంది. ఇలా పలు కారణాల వల్ల నిమ్మకాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ ధర రూ.15 నుండి 20లోపు ఉంది. ఇక నెలరోజుల క్రితం కిలోకు రూ.70-80 ఉండే నిమ్మ ధర.. ప్రస్తుతం రూ.300-400గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com