సీఎం జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారంగానే పరిగణించాలి : అటార్నీ జనరల్

సీఎం జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారంగానే పరిగణించాలి : అటార్నీ జనరల్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి CM జగన్ రాసిన లేఖను, ఆ తర్వాత దానిపై ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణించాలని అటార్నీ జనరల్ కేకే..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి CM జగన్ రాసిన లేఖను, ఆ తర్వాత దానిపై ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తనకు లేఖ రాసిన అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయకు రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ ఆమోదం అవసరం లేదని కూడా KK వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం CJI పరిధిలో ఉన్నందున ఈ విషయంలో తాను ఇంతకంటే కలుగచేసుకోలేనని వివరణ ఇచ్చారు.

అక్టోబర్ 6వ తేదీన ఏపీ సీఎం జగన్‌ CJIకి లేఖ రాశారు. దీనిపైనే ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం 10వ తేదీన ప్రెస్‌మీట్‌ పెట్టారు. సున్నితమైన అంశంపై CJIకు లేఖ రాశాక దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం అంటే ఇది దురుద్దేశంతో కూడుకున్నట్టే కనిపిస్తోందనని KK వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌పై 31 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేకే వేణుగోపాల్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణపై సెప్టెంబర్‌ 16వ తేదీన జస్టిస్ NV రమణ తీర్పు తర్వాత.. ఆయనపై లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Tags

Next Story