Pradeep Sharma: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌కి జీవితఖైదు

మాఫియా డాన్ ఛోటా రాజన్ అనుచరుడి ఎన్ కౌంటర్ కేసులో మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు విధిస్తూ బాంబే హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కింది కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఇది బూటకపు ఎన్ కౌంటరేనని నిర్ధారించింది. 2006లో చోటా రాజన్ ముఠా సభ్యుడైన రామ్‌నారాయణ్ గు ప్తాను ఎన్‌కౌంటర్ చేశారు.
ఛోటా రాజన్ ముఖ్య అనుచరుడు లఖన్ భయ్యా 2006లో ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. ఈ కేసులో ప్రదీప్ శర్మతో పాటు, మరో 13 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అందులో 12 మంది పోలీసులు, బయటి వ్యక్తి ఒకరు ఉన్నారు. అయితే గతంలో ఈ కేసులో ప్రదీప్ శర్మను ట్రయల్ కోర్టు నిర్దోషిగా పేర్కొనగా, అతడి నిర్దోషిత్వాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని అతడు దోషి అని నిర్ధారించింది.
ముంబైలో గ్యాంగ్‌స్టర్ల గుండెల్లో నిద్రపోయి, వారిని ఉరుకులు, పరుగులు పెట్టించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ సూర్యవంశీ శర్మ. ఆయన 112 మంది కరుడుగట్టిన నేరస్తులను వివిధ ఎన్ కౌంటర్లలో అంతమొందించాడని చెబుతుంటారు. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ సూర్యవంశీ శర్మ ముంబయిలో జరిగిన ఎన్నో ఎన్‌కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దావూద్ గ్యాంగ్ పేరును వినిపించకుండా చేయడంలోనూ, రామ్ నారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా ఎన్‌కౌంటర్‌లోనూ ప్రదీప్‌దే కీలకపాత్ర. ఈయన జీవితం ఆధారంగా అబ్ తక్ చప్పన్ పేరుతో బాలీవుడ్‌లో సినిమా నిర్మించారు. ప్రదీప్ శర్మ గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిల్లా ఎదుట పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులోనూ, మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com