Railway Track : యూపీలో రైలు పట్టాలపై ఇసుక కుప్ప..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ.. డంపర్ నుంచి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. దీంట్లో భాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఇది జరిగిన కొసేపటికే రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
ఇక, ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి.. రైలును ఆపాడని ఖోరోన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ దేవేంద్ర భడోరియా చెప్పుకొచ్చారు. లోకో పైలట్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు వెళ్లిందన్నారు. ఈ టైంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. గేట్మెన్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.. ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేది అన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
గతంలో కూడా
గత నెల 22న ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ వద్ద జరిగింది. ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై గుర్తించిన అయిదు కిలోల సామర్థ్యం గల ఖాళీ సిలిండర్‌ను తొలగించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. అలాగే గుజరాత్‌లోని కిమ్-కోసాంబ మధ్య కిమ్ వంతెన సమీపంలో సెప్టెంబర్ 21న పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌ను తొలగించి, గరీబ్ రథ్ రైలును ప్రమాదానికి గురయ్యేలా చేయాలని చేసిన కుట్ర విఫలమైంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com