Lok Sabha:పార్లమెంట్‌ ఉభయ సభల నిరవధిక వాయిదా, 7వ లోక్‌సభ విశేషాలు ఇవే

Lok Sabha:పార్లమెంట్‌ ఉభయ సభల నిరవధిక వాయిదా, 7వ లోక్‌సభ విశేషాలు ఇవే
ముగిసిన 17వ లోక్‌సభ చివరి సమావేశాలు

17వ లోక్‌సభ వివిధ అంశాల్లో మెరుగ్గా నిలిచింది. యువత అధిక శాతం ఉండటం, మహిళల ప్రాతినిధ్యం పెరగటం ద్వారా మరో ప్రత్యేకత సాధించింది. దాదాపు 4వందల ఎంపీలు పట్టభద్రులు ఉన్నారు. 17వ లోక్‌సభలో...మెుదటిసారి ఎన్నికైన ఎంపీలు... మెుత్తం స్థానాల్లో సగానికి కంటే తక్కువ ఉన్నారు. అయితే ఒక్కటి కంటే ఎక్కువసార్లు గెలిచిన సభ్యులు అధికంగా ఉన్నారు.

2019సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 303 స్థానాలు సాధించగా...చివరి సమావేశాల నాటికి ఆ సంఖ్య 290కి పడిపోయింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13మంది ఎంపీలు గెలవటంతో...వారు తమ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 17వ లోక్‌సభలో జాతీయపార్టీల తరఫున 397మంది గెలుపొందారు. అయితే మొత్తం సభ్యుల్లో 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. 17వ లోక్‌సభలో ఎంపీల సగటు వయస్సు 54ఏళ్లుగా ఉంది. 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎంపీలు మెుదటి లోక్‌సభలో 26 శాతంగా ఉండగా...16వ లోక్‌సభ నాటికి అది క్రమంగా 8శాతానికి తగ్గింది. యువ ఎంపీల శాతం 12 శాతానికి పెరగటం మరో విశేషం. 2019లో ఒడిశా- కియోంఝర్ పార్లమెంటు స్థానం నుంచి BJD తరఫున ఎన్నికైన చంద్రానిముర్ము...25 ఏళ్ల 11 నెలల వయస్సుతో అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. ప్రస్తుత లోక్‌సభలో పురుషులతో పోలిస్తే మహిళలే తక్కువ వయస్సు కలిగి ఉన్నారు. 2014లో 62మంది మహిళా ఎంపీలు గెలుపొందగా...2019లో ఆ సంఖ్య 78కి పెరిగింది. మెుదటి లోక్‌సభలో మహిళల ప్రాతినిథ్యం 5శాతం కాగా...ఆ సంఖ్యక్రమంగా పెరుగుతూ 2019నాటికి 14 శాతానికి పెరిగింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మహిళల ప్రాతినిథ్యం మనదేశంలో తక్కువగానే ఉంది. రువాండాలో మహిళా ప్రాతినిథ్యం అత్యధికంగా 61శాతం ఉంది. దక్షిణాఫ్రికా 43శాతం, బ్రిటన్‌ 32, అమెరికా 24, బంగ్లాదేశ్‌లో 21శాతం మహిళా సభ్యులు ఉన్నారు. 17వ లోక్‌సభ సభ్యుల్లో 39శాతం మంది...రాజకీయాలు, సామాజిక సేవ తమ వృత్తి అని పేర్కొనగా 38శాతం ఎంపీలు వ్యవసాయం, 23 మంది వ్యాపారం తమ వృత్తి అని ప్రకటించారు.

ఇన్ని అంశాల్లో సానుకూలతలు ఉన్నా సమావేశల నిడివి పరంగా 17వ లోక్‌సభ నిరాశ పరిచింది. లోక్‌సభ చరిత్రలోనే అతి తక్కువ సార్లు సమావేశమైన అపఖ్యాతిని మూటగట్టుకుంది. 17వ లోక్‌సభ ఐదేళ్ల కాలంలో 272 సార్లు మాత్రమే సమావేశమైంది. 16వ లోక్‌సభ ఐదేళ్ల కాలంలో 331 సార్లు సమావేశమైంది. ఈ మేరకు PRS అనే మేథోసంస్థ లోక్‌సభ సమావేశాలపై ఒక నివేదికను విడుదల చేసింది. మెుదటి లోక్‌సభ అత్యధికంగా 677 సార్లు సమావేశమైంది

Tags

Read MoreRead Less
Next Story