LOKSABHA: డేటా పరిరక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

LOKSABHA: డేటా పరిరక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
గోప్యత దెబ్బతింటుందన్న విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం... డిజిటల్‌ హక్కుల బలోపేతానికి బిల్లన్న కేంద్రం...

దేశ ప్రజల డిజిటల్‌ హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు(Digital Personal Data Protection Bill, 2023)ను లోక్‌సభ ఆమోదించింది(Lok Sabha passes). ఆగస్టు 3న లోక్‌సభలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్(Union IT Minister Ashwini Vaishnaw ) ఈ బిల్లుని ప్రవేశపెట్టగా గోప్యత దెబ్బతింటుందన్న విపక్షాల ఆందోళనల)Opposition had demanded ) నడుమే బిల్లు పాసైంది. మూజువాణి ఓటుతో బిల్లు పాసైనట్లు స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల(Rs 250 crore and minimum of Rs 50 crore ) జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.


ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ప్రతి పౌరుడి డిజిటల్‌ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. ఈ బిల్లుతో సోషల్ మీడియా సంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఈ చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్‌ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్‌ చేసేందుకు పర్మిషన్‌ ఉంటుంది.

వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుందని. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలని బిల్లులో పేర్కొన్నట్లు కేంద్రం చెబుతోంది.


మరోవైపు పత్రికా స్వేచ్ఛపై, పాత్రికేయులపై డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లులోని నిబంధనలు. పౌరులపై నిఘాకు విధి విధానాలు సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా విజ్ఞప్తి చేసింది. వ్యక్తిగత డేటా రక్షణకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య సమతూకం పాటిస్తూ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను బిల్లులో చేర్చకపోవడం సరికాదని తెలిపింది. డేటా ప్రొటెక్షన్‌ బోర్డు కూర్పుపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రభావానికి లోనుకాకుండా బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story