Lok Sabha: "అవిశ్వాసం"పై చర్చ అప్పటినుంచే..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్(manipur)లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో పార్లమెంట్(Lok Sabha )లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(no-confidence motion)పై చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి( August 8 to 10) మూడు రోజుల పాటు లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుండగా ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ(PM Modi to reply )సమాధానమివ్వనున్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి ప్రాధాన్యం ఇచ్చి వెంటనే చర్చ చేపట్టాలని BAC సమావేశంలో విపక్షాలు కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, తృణమూల్, వామపక్షాలు, భారాస డిమాండ్ చేశాయి. అందుకు అధికార పక్షం ఒప్పుకోకపోవడంతో BAC సమావేశం నుంచి వాకౌట్( walk out) చేశాయి.
16వ లోక్‌సభలో తెలుగుదేశంపార్టీ(TDP) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మరుసటి రోజే చర్చ జరిగిన విషయాన్ని కాంగ్రెస్ సభ్యులు(CONGRESS) గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆలస్యం చేయడం తగదని వాదిస్తున్నారు. ఐతే అవిశ్వాస తీర్మానంపై తక్షణమే చర్చ చేపట్టాలని ఎలాంటి నిబంధనలు లేవని అధికార పక్షం అంటోంది. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతించిన 10 రోజుల్లో చర్చ చేపట్టాలని మాత్రమే నిబంధనల్లో ఉందని స్పష్టం చేసింది.
అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు చేసిన ఆరోపణలను భాజపా ఖండించింది. తమకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలనే నిబంధనేమీ లేదని, 10 రోజుల్లోగా ఎప్పుడైనా చేపట్టవచ్చని చెప్పారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి జులై 26న స్పీకర్ అనుమతినిచ్చారు. లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. లోక్‌సభలో 350 మందికిపైగా ఎంపీల మద్దతు తమకు ఉందని అధికార పక్షం చెబుతోంది. విపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులు ఉన్నారు. ఈ తీర్మానంపై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ మణిపుర్‌పై ప్రధాని స్పందించాలనే లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టారు.
2014 నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై తొలి అవిశ్వాస తీర్మానం జూలై 20, 2018న ప్రవేశపెట్టగా.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఘన విజయం సాధించింది. 325 మంది ఎంపీలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, కేవలం 126 మంది మద్దతుతో గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com