Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్

Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్
X
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా, ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ లో8, హర్యానా 10, జమ్ముకశ్మీర్ లో 1, ఝర్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. కాగా, వీటితో పాటు ఒడిశా అసెంబ్లీలో 42 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

ఇక, ఈ ఆరో దశలో ఎన్నికల బరిలో సంబల్పూర్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (కర్నాల్), దీపేందర్ హుడా (రోహ్‌తక్), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్), పీడీపీ చీఫ్ మెహబూబా ముస్తీ (అనంతనాగ్- రాజౌరీ), నవీన్ జిందాల్ (కరుక్షేత్ర), కన్నయ్య కుమార్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), రావు ఇందరితీసింగ్ (గురుగ్రామ్), బన్సూరి స్వరాజ్ (ఢిల్లీ) నుంచి పోటీ చేస్తున్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలనూ గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా.. అక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్రై చేస్తుంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది. ఇక, ఇండియా కూటమి నుంచి ఎన్డీయేకి గట్టి పోటీ ఇస్తుంది. కాగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 543లో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ దశ ఎన్నికలు కూడా అయిపోతే.. మొత్తం 486 స్థానాలకు పోలింగ్ పూర్తైనట్లు. ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణలోని కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం కూడా రానుంది. అలాగే, జూన్ 6వ తేదీన ఎన్నికల కోడ్ ముగియనుంది.

Tags

Next Story