Lok Sabha Elections: ప్రారంభమైన మూడో విడత పోలింగ్‌

Lok Sabha Elections:  ప్రారంభమైన మూడో విడత పోలింగ్‌
11 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్‌..

సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాల్లోని 93సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ-అనంత్ నాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు.

మధ్యప్రదేశ్‌లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిసున్నారు. గుజరాత్ లోని 26 స్థానాలకు సూరత్ లో భాజపాకు ఏకగ్రీవమైనందున 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హోంమంత్రి అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా పోటీలో ఉన్నారు. కర్ణాటకలో రెండో విడతలో 14సీట్లకు పోలింగ్ పూర్తికాగా మిగిలిన 14 చోట్ల పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో కీలకమైన 11స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే.., మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని పది స్థానాలకు.. పోలింగ్ జరుగుతోంది. ఇక్కడి మెయిన్ పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని 9 సీట్లకు... కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ .. విదిశ నుంచి పోటీలో ఉన్నారు. ఛత్తీస్ ఢ్ లో ఏడు, బిహార్ లో ఐదు, అస్సాంలో 4, పశ్చిమ బెంగాల్ లోని 4, గోవాలో రెండు, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులో రెండు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.

కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పరుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ తృతీయ విడత బరిలో నిలిచిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, సిటింగ్‌ ఎంపీ సుప్రియా సూలే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story