Narendra Modi: స్వల్ప మెజారిటీతో ముందంజలో మోది

ప్రధాన మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతి రౌండ్ కు పరిస్థితులు మారిపోతున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో దూసుకుపోయిన మోడీ క్రమంగా వెనుకబడ్డారు. ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నారు. తన ప్రత్యర్థి అజయ్ పై ప్రస్తుతం 619 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ వేళ మోడీ పోటీ చేసే వారణాసి నియోజకవర్గంలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓ దశలో వెనుకబడిన మోదీ తాజాగా పుంజుకున్నారు. రెండో రౌండ్లో వెనుకబడిన మోదీ మూడో రౌండ్ కి వచ్చేసరికి తన ప్రత్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా 619 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారణాసిలో ప్రధాన మోడీకి 36,424 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయికి 3585 ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరూ స్వల్ప తేడాతోనే ముందు వెనుక స్థానాల్లో కొనసాగడం బిజెపి వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశం వ్యాప్తంగా దాదాపు 300 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతుంది. అన్నిటికంటే మోదీ పోటీ చేసే నియోజకవర్గంలోనే తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. స్వల్ప ఆదిక్యంతో పరిస్థితులు మారిపోవడం.. అది ప్రధాన మోడీ పోటీ చేసే స్థానంలో ఏమవుతుందో అని ఆసక్తి నెలకొంది ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 194 స్థానాల్లో ఆదిత్యంలో కొనసాగుతుంది. బిజెపి ఇప్పటికే ఒక స్థానంలో విజయం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com