Waqf Bill: వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమో దం

X
By - jyotsna |3 April 2025 7:00 AM IST
అర్ధరాత్రి తర్వాత బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించారు.
బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ పడడంతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలు ఎంపీలకు విప్ జారీ చేయడంతో సభ్యులు సభకు హాజరయ్యారు. ఇక గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. ఇక్కడ కూడా దాదాపు 8 గంటల పాటు చర్చ జరగనుంది. అధికార-ప్రతిపక్ష సభ్యులు మాట్లాడనున్నారు. ఇక్కడ బిల్లు ఆమోదం పొందుతుందో.. లేదో చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com