RAHUL: మళ్లీ రక్షణశాఖ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్
రక్షణశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Parliamentary Standing Committee on Defence)కి కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) తిరిగి ఎంపికపయ్యారు. దీనిపై లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై మార్చిలో సభ్యత్వం కోల్పోకముందు ఇదే కమిటీలో ఉన్న రాహుల్ తిరిగి ఎంపికయ్యారు. ఈ కమిటీలోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్(Dr Amar Singh ) కూడా నామినేట్ అయినట్లు లోక్‌సభ బులిటెన్ వెల్లడించింది. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్‌ఆద్మీ తరఫు ఎంపీ సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయినట్లు పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్ మొహమ్మద్ వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారని తెలిపింది.
పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్‌సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com