Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగంపై రగడ.. మైక్ కట్

లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా డోక్లాం ఇష్యూను రాహుల్‌గాంధీ లేవనెత్తారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మాట్లాడాలంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో ప్రధాని మోడీ కూడా కూర్చున్నారు.
మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనికి రాజ్‌నాథ్‌సింగ్ కలుగ జేసుకుని ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని చెప్పారు. అయితే ఆ పుస్తకం పబ్లిష్ కాకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని స్పీకర్ అడిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
