Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆగ్రహజ్వాలలు

మద్యం కుంభకోణం కేసులో...డిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రాజుకున్నాయి. విపక్ష పార్టీల నేతలు కేజ్రీవాల్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఇండియా కూటమి నేతలు ఈ అరెస్టు అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. మొహాలిలో నిరసనకారులపై పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.
మద్యం కేసులో డిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఆప్ శ్రేణులతోపాటు ఇండియా కూటమిలోని పార్టీలు...నిరసన కార‌్యక్రమాలు చేపట్టాయి. మొహాలీలో ఆప్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వందలాదిగా నిరసనకారులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. బారిగేట్లను దాటుకొని వచ్చేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా...వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.
తిరువనంతపురంలో ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు... నిరసన ప్రదర్శన చేపట్టాయి. తమిళనాడులో డీఎంకేశ్రేణులు చెన్నై ఈడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దయానిధిమారన్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. కన్నూరులో సీపీఎం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించి...ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశాయి. ఎర్నాకుళంలో ఆప్ శ్రేణులు భాజపా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టాయి.
మరోవైపు డిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు అరెస్టులకు పాల్పడుతున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగా ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ విమర్శించారు. కేజ్రీవాల్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈడీసహా కేంద్ర దర్యాప్తు సంస్థలు...భాజపా రాజకీయ బృందాలుగా మారాయని ఆరోపించారు. ఎన్నికల ముందు బెదిరించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. కేజ్రీ అరెస్ట్‌ను అప్రజాస్వామిక చర్యగా సిద్ధరామయ్య అభివర్ణించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com