భూమిపై అత్యంత అదృష్టవంతుడిని: రామ్ లల్లా శిల్పి అరుణ్ యోగిరాజ్

భూమిపై అత్యంత అదృష్టవంతుడిని: రామ్ లల్లా శిల్పి అరుణ్ యోగిరాజ్
X
అయోధ్య ఆలయంలో తాను చెక్కిన శిల్పం ప్రతిష్టించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాడు అరుణ్ యోగిరాజ్.

అయోధ్య ఆలయంలో తాను చెక్కిన శిల్పం ప్రతిష్టించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాడు అరుణ్ యోగిరాజ్. తనను తాను భూమిపై అత్యంత అదృష్టవంతుడిగా చెప్పుకుంటున్నాడు. రామ్ లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా జరిగిందా లేక కలా అని కూడా భావిస్తున్నానని అన్నారు.

కుటుంబంలో తాను ఐదవ తరం శిల్పి అని, అనేక విగ్రహాలను తయారు చేశానని చెప్పారు. అయితే ఆయన చెక్కిన విగ్రహం కోసం ప్రపంచం మొత్తం ఇంత ఆసక్తిగా ఎదురుచూడడం గతంలో ఎన్నడూ జరగలేదు. అందుకే, జనవరి 22న, తాను చెక్కిన రామ్ లల్లా విగ్రహం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక రోజున, అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా సహజంగానే ఉప్పొంగిపోయాడు.

ఈరోజు (జనవరి 22) విగ్రహం కళ్లకు కప్పిన కండువాను తొలగించిన తర్వాత బాల రాముడి ముఖం ప్రపంచమంతా చూసింది. రాముడి నగుమోముకి ప్రపంచం మొత్తం ఆకర్షితురాలైంది. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా యొక్క ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది అని యోగిరాజ్ సోమవారం అన్నారు.

అయోధ్యలోని రామమందిరంలో జరిగిన 'ప్రాణ్‌ప్రతిష్ఠ' వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన 'జజామాన్‌' తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. 'ప్రాణ్‌ప్రతిష్ఠ' వేడుకకు ముందు, కళ్లకు గంతలు తొలగించి పూర్తి చేసిన విగ్రహాన్ని ఆబరణాలతో అలంకరించారు. బాల రాముడి అందమైన రూపం అలంకారంతో మరింత ద్విగుణీకృతమైంది.

రామ్ లల్లా విగ్రహాన్ని గత వారం ఆలయంలో ఉంచారు, ఐదు సంవత్సరాల వయస్సు గల రాముడిని కమలంపై నిలబడి ఉన్నట్లు చిత్రీకరించారు. నల్లరాతితో అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహం నేటి వేడుకలో అఖండ భక్త జన కోటి ముందు ఆవిష్కృతమైంది.

ఈరోజు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిరంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆయన ఈ ముఖ్యమైన రోజు కోసం 11 రోజుల మతపరమైన ఆచారాలను శ్రద్ధగా ఆచరించారు.

Tags

Next Story