Madhya Pradesh Exit Polls 2023: ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

Madhya Pradesh Exit Polls 2023: ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?
మధ్యప్రదేశ్‌లో హోరా హోరీ పోరు

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే మధ్యప్రదేశ్‌లో ఈనెల 17న జరిగిన పోలింగ్‌లో మళ్లీ భాజపానే అధికారానికి వస్తుందని టుడేస్‌ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనావేసింది.

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు ఉండగా 17న జరిగిన ఎన్నికల్లో భాజపాకు 139 నుంచి 163 స్థానాలు, కాంగ్రెస్‌ 62 నుంచి 86, ఇతరులు 1 నుంచి 9సీట్లు గెలవొచ్చని టుడేస్‌ చాణక్య సర్వేలో తేలింది. దైనిక్‌-భాస్కర్‌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్‌లో భాజపాకు 95 నుంచి 115 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్‌ 105 నుంచి 120 స్థానాలు, ఇతరులు 15చోట్ల.. గెలిచే అవకాశముంది. కమలదళం 118 నుంచి 130 సీట్లు గెలవొచ్చని రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 సీట్లు రావొచ్చని వెల్లడైంది. జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో భాజపాకు 100 నుంచి 123 స్థానాలు.., కాంగ్రెస్‌కు 102 నుంచి 125 స్థానాలు రావొచ్చని వెల్లడైంది. పీపుల్స్‌ పల్స్‌ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 117 నుంచి 139 స్థానాలు, భాజపా 91 నుంచి 113 స్థానాలు గెలిచే అవకాశముందని పీపుల్‌ పల్స్‌ పేర్కొంది. టీ9-భారత్‌ వర్ష్‌ ఎగ్జిట్ పోల్స్‌లోభాజపాకు 106 నుంచి 116 స్థానాలు, కాంగ్రెస్‌ 111 నుంచి 121 సీట్లు, ఇతరులు 6 చోట్ల గెలవచ్చని తేలింది. యాక్సిస్‌-మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్‌లో భాజపా 140నుంచి 162 సీట్లతో అధికారాని వస్తుందని తేలింది. కాంగ్రెస్‌ 68నుంచి 90 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుందని తేలింది

ఇతరులు మూడు సీట్లవరకు గెలవొచ్చని వెల్లడైంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం... భాజపాకు 105నుంచి 117,కాంగ్రెస్‌కు 109నుంచి 125, ఇతరులు 1నుంచి 5చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో భాజపా 140నుంచి 159 సీట్లతో అధికారం నిలబెట్టుకోనుంది.కాంగ్రెస్‌ 70నుంచి 89 స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితం కానుంది. ఇతరులు 2సీట్ల వరకు గెలవొచ్చు.

అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అతి స్వల్ప మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. అయితే బీజేపీ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. కాంగ్రెస్ నుంచి రెబల్స్ ను తన వైపుకు తిప్పుకొని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం పార్టీ. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజాభీష్టానికి విరుద్ధంగా మరోసారి సీఎం అయ్యారు. మూడున్నరేళ్ల పాటు కొనసాగారు.

Tags

Next Story