Police Arrest : పోలీసులను చూసి డ్రగ్స్ డీలర్ ఏం చేశాడంటే

Police Arrest : పోలీసులను చూసి  డ్రగ్స్ డీలర్ ఏం చేశాడంటే
X
అరెస్ట్ భయంతో నదిలో దూకిన డ్రగ్స్ డీలర్

పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తే ఆ భయంతో డ్రగ్స్ అమ్మే ఓ వ్యక్తి అయిన నిందితుడు ఏకంగా నదిలో దూకిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటన సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ పట్టణంలో ఖాన్ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. డ్రగ్స్ కేసులో నిందితుడైన ఖాన్ కు నోటీసు ఇచ్చి అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వచ్చారు.

పోలీసులను చూసిన ఖాన్ అరెస్ట్ చేస్తారనే భయంతో ఇంట్లో నుంచి మరో దారి గుండా తప్పించుకొని పరుగెత్తుతూ ఏకంగా నదిలోకి దూకాడు. పోలీసులను చూసి ఖాన్ హడావిడిగా నదిలోకి దూకి, ఈదుకుంటూ అవతలి వైపునకు వెళ్ళిపోయాడు. చివరికి వెళ్లి పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. నది ఒడ్డున ఉన్న పోలీసులు నిందితుడు ఖాన్ ను ఒడ్డుకు రమ్మని విజ్ఞప్తి చేసినప్పటికీ నిందితుడు నదిలో నుంచి బయటకు రావడానికి నిరాకరించారు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం మంగళవారం వెలుగుచూసింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు నదిలో ఈదుకుంటూ మరో ఒడ్డుకు చేరుతున్న వీడియోను ఒకరు తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

డ్రగ్స్ విక్రేత ఖాన్ పై సెక్షన్ 110 సహా పలు ఇతర అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేరస్తుడు ఖాన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఖాన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

డ్రగ్స్ విక్రేతలు పోలీసులనుంచి తప్పించుకోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కేరళలో ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ఒక వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. డ్రగ్స్ డీలర్ గా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి సోదాల కోసం వెళ్లిన పోలీసులపై ఆ కుక్కలు దాడిచేయబోగా వారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో డ్రగ్స్ డీలర్‌గా అనుమానిస్తున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో ఈ డాగ్ ట్రైనింగ్ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా అతడి ఇంట్లో ఉన్న సుమారు 13 కుక్కలు పోలీసులపై దాడి చేయబోగా వారు తృటిలో తప్పించుకున్నారు.

Tags

Next Story