BRIBE: లంచం డబ్బు... నమిలి మింగేశాడు...

లంచం(bribe) డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ ఉద్యోగి ఆ నగదును నమిలి మింగేశాడు. మీరు వింటున్నది నిజమే. అధికారులను చూసి వారి నుంచి తప్పించుకునేందుకు ఓ అధికారి లంచంగా తీసుకున్న డబ్బును నమిలి మింగేశాడు. అతడి పరిస్థితి విషమంచడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు మింగేసిన లంచం నోట్లను కక్కించారు.
మధ్యప్రదేశ్( Madhya Pradesh) కత్ని(Katni )కి చెందిన రెవెన్యూ అధికారి గజేంద్ర సింగ్(patwari Gajendra Singh) బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు లోకాయుక్త(Lokayukta )కు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(Special Police Establishment) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ చేసిన అధికారులు లంచగొండి అధికారిని రెడ్ హ్యాండెడ్‌కు పట్టుకున్నారు. గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను నమిలి మింగేశాడు.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆ నోట్లను కక్కించారు. అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చిరు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com