Panneerselvam: హైకోర్టు తీర్పుతో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట..

Panneerselvam: అన్నాడీఎంకే నాయకత్వ వ్యవహారం కేసులో మద్రాస్ హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేయడంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది.
అన్నాడీఎంకే కేసులో.. ఇవాళ మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదని.. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలని వాదనలు వినించారు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు.. స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com