కాశ్మీర్ లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

కాశ్మీర్ లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
X
మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో తూర్పు కాశ్మీర్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4 నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో తూర్పు కాశ్మీర్‌లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా గండో భలెస్సా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పారు.ఈ భూకంపంతో జమ్మూకశ్మీర్‌లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. శ్రీనగర్‌కు చెందిన ప్రజలు మాట్లాడుతూ, "భూకంపం పాఠశాల పిల్లలను భయపెట్టింది. దుకాణాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇది భయానకంగా ఉంది. గత వారం ప్రకంపనల కంటే చాలా తీవ్రంగా ఉంది." అని అన్నారు.

Tags

Next Story