Maha Kumba: నేటి నుంచి మహా కుంభ మేళా

Maha Kumba: నేటి నుంచి మహా కుంభ మేళా
X
భారీ ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. 35 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నేటి నుంచి ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరుకావచ్చునని అంచనా వేసింది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ మహాత్ కార్యక్రమం నిర్వహించడానికి యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు

అపూర్వ ఆధ్యాత్మిక సంగమం కుంభమేళ నేటి నుంచి ఆరంభం కానుంది. ఈ మహా కుంభమేళా.. ఈ నెల 13 నుంచి 45 రోజులపాటు కొనసాగనుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు 35 కోట్లమంది భక్తులు తరలివస్తారన్న అంచనాతో దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.


35కోట్ల మంది రానున్నట్లు అంచనా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మొదలయ్యే ‘మహా కుంభమేళా’కు భారత్‌ సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే చోట పుణ్య స్నానాలు ఆచరించేందుకు దాదాపు 35 కోట్ల మంది భక్తులు రానున్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాధువులు, సాధ్వీలు, నాగ సాధువులు భారీగా హాజరుకానున్నారు. ఈ మేళా కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

రూ.4లక్షల కోట్లకు పైగా వ్యయం

2025 మహాకుంభ మేళాలో 35 కోట్ల మందికి పైగా భక్తులు హాజరుకానున్నారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ప్రతి వ్యక్తి సగటున రూ. 5,000-10,000 ఖర్చు చేస్తే ఆర్థిక కార్యకలాపాలు రూ.4.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఈ ఖర్చులు వసతి, రవాణా, క్యాటరింగ్, హస్తకళలు, పర్యాటకం వంటి అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో ప్రణాళికేతర ఆర్థిక కార్యకలాపాలకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ.

Tags

Next Story