Kerala ragging horror: మహాకుంభమేళా భక్తులకు చుక్కలు చూపిస్తున్న రేట్లు
మాఘ పూర్ణిమ సందర్భంగా బుధవారం మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. భక్తులపై హెలికాప్టరుతో పూలవర్షం కురిపించారు. ఈ మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల కల్పవాసీ దీక్ష ముగించుకొని దాదాపు 10 లక్షలమంది భక్తులు కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. లఖ్‌నవూలోని తన అధికారిక నివాసంలోని వార్ రూం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తన సతీమణి చేతనా రామతీర్థతో కలిసి త్రివేణీసంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. భక్తుల రాకపోకలకు అనువుగా రాష్ట్ర రవాణాశాఖ 1,200 అదనపు షటిల్ బస్సు సర్వీసులను నడిపింది.
భారీ సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాను సందర్శిస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర ఏర్పాట్లు చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభ్‌పై అంచనాలను పెంచివేసిందని, దీంతో అక్కడకు వెళ్లిన భక్తులను పెంచిన ధరలు, సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో మహా కుంభ్‌ను సందర్శించిన కొందరు భక్తులు కూడా అదే మాట చెప్పారు.
సంగం వద్దకు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలు, ఇతరవాహనాలు వందల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని దినేశ్ రాణా అనే భక్తుడు వాపోయాడు. సాధారణ హోటల్ ధరలు సైతం ఫైవ్ స్టార్ రేట్లను మరపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు రూ. 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు. సంగం వద్దకు వెళ్లడానికి పడవలో ఒక్కో మనిషికి రూ. 150 చొప్పున తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పడవ నిర్వాహకులు దండుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com