మత మార్పిడి చేస్తే ఇక ఏడేళ్లు జైలుకే .. అసెంబ్లీలో బిల్లు పాస్ .. ఎక్కడ అంటే ?

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. బలవంతపు, మోసపూరిత మత మార్పిడిలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన 'మత స్వేచ్ఛ బిల్లు 2026'కు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం వాయిస్ ఓట్ ద్వారా ఈ బిల్లును సభ ఆమోదించింది. పెళ్లి పేరుతో ప్రలోభ పెట్టడం, బెదిరించడం లేదా మోసగించి మతం మార్చడాన్ని ఈ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది.
నిబంధనలు ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు
ఈ కొత్త చట్టం ప్రకారం మత మార్పిడి ఉల్లంఘనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఖరారు చేశారు. పెళ్లి పేరుతో చట్టవిరుద్ధంగా మతం మార్పిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధిస్తారు. అలాగే మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మార్పిడిలకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల భారీ జరిమానా ఉంటుంది. అంతేకాకుండా సామూహికంగా మత మార్పిడిలు చేసినా అదే ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు. ఒకే నేరాన్ని మళ్లీ మళ్లీ చేసేవారికి శిక్షా కాలాన్ని 10 ఏళ్లకు పెంచుతూ నిబంధనలు రూపొందించారు.

ఈ బిల్లుకు ఆశ్చర్యకరంగా ప్రతిపక్ష శివసేన (యూబీటీ) మద్దతు తెలిపింది. ఇది సమగ్రమైన బిల్లు అని, ఏ మతాన్ని లక్ష్యం చేసుకోవడం లేదని ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగం కల్పించిన గోప్యతకు భంగం కలిగిస్తుందని అసమ్ షేక్, అబూ అసిమ్ అజ్మీ వంటి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మతం మారాలనుకునే వ్యక్తి 60 రోజుల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్‌కు నోటీసు ఇవ్వాలని, మార్పిడి తర్వాత 21 రోజుల్లోగా అధికారులకు సమాచారం ఇవ్వాలని హోం శాఖ సహాయ మంత్రి పంకజ్ భోయర్ వివరించారు. ఈ ప్రక్రియ కేవలం పారదర్శకత కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com