Maharashtra : పెట్రోల్‌పై ఏక్‌నాథ్ షిండే మహా నిర్ణయం..

Maharashtra : మహారాష్ట్రలో పెట్రోలు డీజిల్ రేట్లను మరో 5, 3 రూపాయలను తగ్గించింది ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం. దీంతో పెట్రలు రూ. 106, డీజిల్ రూ.94 కు అక్కడ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రోజే దీనికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజలపై భారం తగ్గించడం కోసం వ్యాట్‌ను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే తెలిపారు.
వ్యాట్ తగ్గించడంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీ సంవత్సరం 6వేల కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం రాజకీయం అయినప్పటికీ మహారాష్ట్ర ప్రజలకు కొంత ఊరట కలిగించేదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెండు వారాల క్రితం శివసేనలోని ఏక్‌నాథ్ షిండే గ్రూపు ఉద్ధవ్‌థాక్రేపై తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏరర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com